సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఘోరదురితములచే
టైటిల్: ఘోరదురితములచే
పల్లవి:
ప|| ఘోరదురితములచే గుణవికారములచే- | నీరీతిబడునాకు నేది దెరువు ||
చరణం:చ|| హరి జగన్నాథు లోకారాధ్యు- | నెరగలేనివాని కేది దెరువు |
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి- | నిరవుకొలుపనివాని కేది దెరువు ||
చ|| శ్రీవేంకటేశు దలచినవెనుక సకలంబు- | నేవగింపనివాని కేది దెరువు |
దేవోత్తముని మహిమ దెలిసితెలియగలేని- | యీవివేకంబునకు నేది దెరువు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం