సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: గరుడాద్రి వేదాద్రి కలిమి
పల్లవి:

గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె |
సిరులొసగీ చూడరో చింతామణి ఈపె ||

చరణం:

పాలజలధిపుట్టిన పద్మాలయ ఈపె |
లాలిత శ్రీనారసింహ లక్ష్మి ఈపె |
మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె |
ఈలీలా లోకములేలే ఇందిర ఈపె ||

చరణం:

ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె |
మనసిజుగనిన రమాపతి ఈపె |
అనిశము పాయని మహాహరిప్రియ ఈపె |
ధనధాన్యరూపపు శ్రీతరుణి ఈపె ||

చరణం:

రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె |
మచ్చికగల అలమేల్మంగ ఈపె |
ఇచ్చట వేంకటాద్రి నీ అహోబలమునందు |
నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం