సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: గుట్టుతోడి బ్రదుకొక
టైటిల్: గుట్టుతోడి బ్రదుకొక
పల్లవి:
ప|| గుఱ్ఱాల గట్టనితేరు కొంక కెందైనా బారీ | విఱ్ఱవీగుచు దీసీని వేడుకతో జీవుడు ||
చరణం:చ|| సరి పిఱుదే రెండు జంటబండికండ్లు | సరవితో బాదాలు చాపునొగలు |
గరిమ జూపులు రెండు గట్టిన పగ్గములు | దొరయై దేహరథము దోలీబో జీవుడు ||
చ|| పంచభూతములు పంచవన్నెకోకలు | పంచల చేతులు రెండు బలుటెక్కేలు |
మించైన శిరసే మీదనున్న శిఖరము | పంచేంద్రియ రథము పఱపీబో జీవుడు ||
చ|| పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు | తోపులయన్నపానాలు దొబ్బుదెడ్లు |
యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ | కాపాడిన రథము గడపీబో జీవుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం