సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హిన దశలు బొంది
పల్లవి:

హిన దశలు బొంది ఇట్లు నుండుట కంటె
నానా విధులను నున్ననాడే మేలు

చరణం:

అరుదైన క్రిమి కీటకాలందు పుట్టి
పరిభవములనెల్ల బడితిగాని
ఇరవై నచింత నాడింతలేదు ఈ-
నరజన్మముకంటె నాడే మేలు

చరణం:

తొలగక హేయజంతువులయందు పుట్టి
పలువేదనల నెల్ల బడితి గాని
కలిమియు లేమియు గాన నేడెరిగి
నలగి తిరుగుకంటె నాడే మెలు

చరణం:

కూపనరకమున గుంగి వెనకకు నే
బాపవిధులనెల్ల బడితిగాని
యేపున తిరువేంకటెశ నా కిటువలె
నాపాలగలిగిన నాడే మెలు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం