సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరి గొలిచియు మరీ
పల్లవి:

ప|| హరి గొలిచియు మరీ నపరములా | తిరముగ నతనినే తెలియుటగాకా ||

చరణం:

చ|| పంకజనాభునిపాదములు దలచి | యింకా మరియొక యితరములా |
అంకెల నతనివే ఆతనిదాసులనే | కొంకొక నిజముగ గొలుచుటగాకా ||

చరణం:

చ|| పన్నగశయనునిబంట్లకు బంటై | కొన్నిటిపై మరి కోరికెలా |
యిన్నికోరికలు యిదియే తనకని | కొన్నదికోలై కోరుటగాకా ||

చరణం:

చ|| వీనుల వేంకటవిభునామామృత- | మూనిన మతి మరియును రుచులా |
తేనెలుగారెడితీపు లతనినుతి | నానారుచులై ననుచుటగాకా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం