సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరి నీవె సర్వాత్మకుడవు
పల్లవి:

హరి నీవె సర్వాత్మకుడవు
యిరవగు భావననీయగదె

చరణం:

చూడకమానవు చూచేటి కన్నులు
ఏడనేవైనయితరములు
నీడలనింతానీరూపములని
ఈడువదని తెలివీయగదె

చరణం:

పారక మానదు పాపపు మనసిది
ఈరసములతో ఎంతైనా
నీరజాక్షయిది నీమయమేయని
ఈరీతులతలపీయగదె

చరణం:

కలుగక మానవు కాయపు సుఖములు
ఇలలోపల గలవెన్నైనా
అలరిని శ్రీవేంకటధిప నీకే
యిలనర్పితమను ఇహమీయగదె

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం