సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరి నీవే బుద్ధిచెప్పి
టైటిల్: హరి నీవే బుద్ధిచెప్పి
పల్లవి:
హరి నీవే బుద్ధిచెప్పి యాదరించు నామనసు
హరి నీవే నాయంతర్యామివిగాన ||
వసముగానికరివంటిది నామనసు
యెసగి సారెకు మదియించీగాన
పొసగ బాదరసము బోలిననామనసు
అసము దించక సదా అల్లాడీగాన ||
వడి నడవుల చింకవంటిది నామనసు
బడిబడి బట్టబట్ట బారీగాన
కడగి విసరుపెనుగాలివంటిది మనసు
విడువక కన్నచోట విహరించీగాన ||
వరుస నిండుజలనిధివంటిది నామనసు
వొరసి సర్వము లోనై వుండీగాన
గరిమ శ్రీవేంకటేశ కావవే నామనసు
సరి నీయానతి నీకే శరణనిగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం