సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరి నీయనుమతో ఆది
పల్లవి:

ప|| హరి నీయనుమతో ఆది నాకర్మమో | పరమే యిహమై భ్రమయించీని ||

చరణం:

చ|| కలుగదు శాంతము కటకట బుద్ధికి | చలమున నింతా జదివినను |
నిలువదు చిత్తము నీపై చింతకు | పలుసంపదలను బరగినను ||

చరణం:

చ|| తగులదు వైరాగ్యధన మాత్మకును | వొగి నుపవాసము లుండినను |
అగపడదు ముక్తి ఆసలనాసల | జగమింతా సంచరించినను ||

చరణం:

చ|| విడువదు జన్మము వివేకముననే | జడిసి స్వతంత్రము జరపినను |
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే | బడిగాచితి విదె బ్రదికితి నేను ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం