సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరి శరణాగతి యాతుమది
టైటిల్: హరి శరణాగతి యాతుమది
పల్లవి:
ప|| హరి శరణాగతి యాతుమది | సరుస నిదియెపో సతమయ్యెడిది ||
చరణం:చ|| దిన దిన రుచులివి దేహము వి- | చెనకెటి కోరిక చిత్తముది- |
యెనసెటి కాంతులు యింద్రియంబులవి | పనివి యాత్మకిని పసిలేదయ్యా ||
చ|| పదరెటి కోపము పాపముది | అదవ గాలములు అనాదివి |
నిదుర తమోగుణ నిలయముది | యెదుట నాత్మకివి యెవరయ్యా ||
చ|| కాయపు జననము కర్మముది | మాయ లంపటము మమతలది |
యేయెడ శ్రీ వేంకటేశుడితని కృప | పాయని యాత్మకు బ్రమాణమయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం