సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
పల్లవి:

హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
తరగు మొరగులను దాటలే రెవ్వరును

చరణం:

నిండు జింతాజలధికి నీళ్ళు దనచిత్తమే
దండిపుణ్యపాపాలే దరులు
కొండలవంటికరళ్ళు కోరికె లెందు చూచినా
తండుముండుపడేవారే దాటలే రెవ్వరును

చరణం:

ఆపదలు సంపదలు అందులోనిమకరాలు
కాపురపులంపటాలే కైయెత్తులు
చాపలపుగుణములే సరిజొచ్చేయేరులు
దాపుదండ చేకొని దాటలే రెవ్వరును

చరణం:

నెలవై వుబ్బునగ్గులే నిచ్చలు బోటును బాటు
బలువైనయాళే బడబాగ్ని
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ
తలచి యితరులెల్ల దాటలే రెవ్వరును

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం