సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరిదాసుడై మాయల
పల్లవి:

హరిదాసుడై మాయల జిక్కువడితే
వెఱపించబోయి తనే వెఱచినట్లవును ||

చరణం:

శూరుడైనవాడేడజొచ్చిన నడ్డములేదు
ఆరీతిజ్ఞానినికి విధులడ్డములేవు
కారణాన నప్పటినీ గలిగెనా నది మఱి
తేరిననీళ్ళ వండు దేరినట్లవును ||

చరణం:

సిరులరాజైతే నేమి సేసిన నేరమి లేదు
పరమాధికారియైతే బాపములేదు
అరసి తనకుదానే అనుమానించుకొనెనా
తెరువే పో సుంకరి దెలిపినట్లవును ||

చరణం:

భూమెల్ల మేసినా నాబోతుకు బందె లేదు
నేమపుబ్రపన్నునికి నిందలేదు
యీమేర శ్రీవేంకటేశ్వరును శరణుని
సోమరి కర్మమంటితే జుంటీగ కతవును ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం