సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరిదాసులతోడ నల్పులు సరెననరాదు
పల్లవి:

హరిదాసులతోడ నల్పులు సరెననరాదు
గురుడు శిష్యుడుననే గుఱిదప్పుగానా

చరణం:

కోరి ముత్యపుజిప్పల గురిసినవానయు
సారె బెమ్కులలోవాన సరియౌనా
శ్రీరమణు డిన్నిటాను జేరియుంటే నుండెగాక
సారెకు బాత్రాపాత్రసంగ తంతా లేదా

చరణం:

మలయాద్రి మాకులును మహిమీదిమాకులును
చలమున నెంచిచూడ సరియౌనా
అలరి దేవుడు అంతర్యామియైతే నాయగాక
తెలియగ క్షేత్రవాసి దిక్కులందు లేదా

చరణం:

అమరులజన్మములు నసురలజన్మములు
బమళి బుట్టినంతలో సరియౌనా
అమరి శ్రీవేంకటేశు డాతుమైతే నాయగాక
తమితో నధికాతిభేదములు లేవా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం