సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరిదాసుండగుటే యది
టైటిల్: హరిదాసుండగుటే యది
పల్లవి:
ప|| హరిదాసుండగుటే యది తపము | పరమార్థములను ఫలమేలేదు ||
చరణం:చ|| తిట్టినయప్పుడు దీవించి నప్పుడు | అట్టె సమమగునది తపము |
వట్టినేమములు వేవేలు చేసినా | బట్టబయలే గాని ఫలమే లేదు ||
చ|| ఇచ్చిన యప్పుడు ఇయ్యని యప్పుడు | అచ్చుగ నవ్విన దది తపము |
ఇచ్చల పుణ్యము లెన్ని చేసినా | బచ్చన లింతే ఫలమే లేదు ||
చ|| కూడిన యప్పుడు గొణగిన యప్పుడు | ఆడిక విడిచిన యది తపము |
ఈడనే శ్రీవేంకటేశుడే శరణము | పాడి పంతముల ఫలమే లేదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం