సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరినెరుగనిపుణ్య మంటేరుగాన
పల్లవి:

హరినెరుగనిపుణ్య మంటేరుగాన
దురితాలే దురితాలే దురితాలే సుండీ ||

చరణం:

దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు
అడ్డగించుకొని రాసులగుగురుతు
జడ్డులేనిహరికథ చవిలేకుండిన నిట్టే
గొడ్డరే గొడ్డరే గొడ్డరే సుండీ ||

చరణం:

వలెనని మేలెల్ల వడిజేసి కైవల్య-
మలమి చేతిలోననగు గురుతు
తలపు వైష్ణవభక్తి దగులకుండిన నంతా
అలయికే అలయికే అలయకే సుండి ||

చరణం:

తిరమైనట్టితీర్థాలు దిరిగి యందరిలొన
ధర బుణ్యుడవుట యంతకు గురుతు
తిరువేంకటపతి దెలియకుండిన నంతా
విరసాలే విరసాలే విరసాలే సుండీ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం