సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరివారమైతిమి మమ్మవు
పల్లవి:

హరివారమైతిమి మమ్మవు గాదనగరాదు
తరముగా దికను మాతప్పులు లోగొనరో ||

చరణం:

వెన్నడించిసూడువట్టేవిష్ణుమాయ నీకు నేము
యిన్నిటా బంతమిచ్చేము యింక గానరో
నన్నల వెట్టిగొనేటి సంసారబంధము నీకు
మున్నె కిందుపడితిమి ముంచి దయజూడవో ||

చరణం:

ఆడించేటి కామక్రోధాదిజూజరులాల
వోడితిమి మీకు దొల్లె వొరయకురో
వీడనికర్మమ నీకు వెఱచి పూరి గఱచే-
మీడనె ధర్మదార మాకికనైనా బట్టవో ||

చరణం:

దక్కగొన్న మాలోనితనుభోగములాల
మొక్కితిమి మాకు గొంతమొగమోడరో
యెక్కువ శ్రీవేకటేశు డేలె మాజన్మములాల
గక్కన వేడుకొంటిమి కపటాలు మానరో ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం