సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
పల్లవి:

ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా

చరణం:

రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆ
రామమున నిను పాడెను రామ రామ యనుచు
ఆ మెలుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని

చరణం:

కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరె
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని

చరణం:

దశరధాత్మజా నీవు దశశిరుని చంపి
ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయె పనులు

అర్థాలు

మెలుత = స్త్రీ; నెమకు = వెదకు, అన్వేషించు; ఆలి = చెలికత్తె; సేమము = క్షేమము; శశిముఖి = చంద్రుని వంటి ముఖము కలది; చేకొను = జయించు, ఆదరించు

వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం