సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇదివొ సంసార
పల్లవి:

ఇదివొ సంసార మెంతసుఖమోకని
తుదలేనిదుఃఖమను తొడవు గడియించె ||

చరణం:

పంచేంద్రియంబులను పాతకులు దనుదెచ్చి
కొంచెపుసుఖంబునకు గూర్పగాను
మించి కామంబనెడి మేటితనయుండు జని
యించి దురితధనమెల్ల గడియించె ||

చరణం:

పాయమనియెడి మహాపాతకుడు తను దెచ్చి
మాయంపుసుఖమునకు మరువగాను
సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల
బోయి యీనరకమను పురము గడియించె ||

చరణం:

అతిశయుండగు వేంకటాధీశుడను మహా
హితుడు చిత్తములోన నెనయగాను
మతిలోపల విరక్తిమగువ జనియించి య
ప్రతియయి మోక్షసంపదలు గడియించె ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం