సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇదియే వేదాంత
పల్లవి:

ఇదియే వేదాంత మిందుకంటె లేదు
ఇదియే శ్రీవేంకటేశుని మతము ||

చరణం:

విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియేపో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనుక వారెల్ల
విరతి బొందకున్న వీడదు భయము ||

చరణం:

చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తమువలనే శ్రీహరి నిలుచును
చిత్తశాంతిలేక చేరదు పరము ||

చరణం:

ఎంత చదివినా యెంత వెదికినా
యింతకంటె మరియిక లేదు
ఇంతట శ్రీవేంకటేశు దాసులౌట
యెంతవారికైన యిదియే తెరవు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం