సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఈడ నుండె నిందాకా నింటిముంగిట
పల్లవి:

ఈడ నుండె నిందాకా నింటిముంగిట
ఆడ నెందు బోడుగద అప్పుడే యీకృష్ణుడు

చరణం:

యేడ పూతకి జంపె నింతపిన్నవాడంటా
ఆడుకొనే రదే వీధి నందరు గూడి
వేడుకతో మనగోవిందుడు గాడుగదా
చూడరమ్మ వీడు గడుచుల్లరీడు పాపడు

చరణం:

మరలి యపటివాడె మద్దులు విఱిచెనంటా
పరువులు పెట్టేరు పడతులెల్లా
కరికరించగ రోల గట్టితే నప్పుడు మా
హరి గాడుగదా ఆడనున్న బిడ్డడు

చరణం:

వింతగాక నొకబండి విఱిచె నప్పటినంటా
రంతు సేసే రదివో రచ్చలు నిండి
అంత యీశ్రీవేంకటేశు డైనమనకృష్ణుడంట
యింతేకాక యెవ్వరున్నా రిటువంటిపాపడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం