సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఈదిగాక సౌభాగ్యమిదిగాక
పల్లవి:

ఈదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఇ
ఇదిగాక వైభవం బిక నొకతిగలదా? ||

చరణం:

అతివ జన్మము సఫలమై పరమయొగి వలె
నితర మొహోపేక్ష లిన్ని యును విదిచె
సతి కోరికలు మహాశాంతమై ఇదెచూడ
సతత విగ్నాన వాసనవోలె నుండె ||

చరణం:

తరుణి హ్రుదయము క్రుతార్ఢత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయమంది ఇంతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ ||

చరణం:

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్వ
భావంబు నిజముగా బట్టె చెలియాత్మ
దేవోత్తముని క్రుపాధీనురాలై ఇపుడు
లావణ్యవతికి నుల్లంబు తిరమాయ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం