సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇలువేల్పితడే
పల్లవి:

ఇలువేల్పితడే ఇందరికిని మరి
పలువేల్పులతో పనియికనేలా

చరణం:

కమలారమణుని కరుణేకాదా
అమరులు గొనియెడియమృతము
అమితపు శ్రీహరియాధారముగాదా
నెమకేటి ప్రాణులు నిలిచిన భూమి

చరణం:

దనుజాంతకు బొడ్డుతామెర కాదా
జననకారణము సర్వమునకు
మనికై హరిసతిమహిమే కాదా
నినుపై భువిలో నిండినసిరులు

చరణం:

యితనికొడుకు రచనింతాఁగాదా
సతులపతుల సంసారరతి
గతిశ్రీవేంకటపతిలోకమె వు-
న్నతివైకుంటపునగరపుముక్తి

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం