సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇందిరా రమణుదెచ్చి
పల్లవి:

ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజింప పొద్దాయనిపుడు !!

చరణం:

ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీతనయా
ఘోర(తూల)నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా !!

చరణం:

నానాదేవతలకు నరసింహు కంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడౌ కృష్ణ మహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా !!

చరణం:

శ్రీ వల్లభునకు అశేష కైంకర్యముల
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా
దేవుని నీవేళనిట్టె తెచ్చి మాకు నియ్యరే !!

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం