సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇందరికి న భయంబులిచ్చ
పల్లవి:

ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి !!

చరణం:

వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి !!

చరణం:

తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి !!

చరణం:

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి !!

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం