సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇందుకేపోవెరగయ్యీ
పల్లవి:

ఇందుకేపోవెరగయ్యీ నేమందును
కందులేని నీమహిమ కొనియాడగలనా ||

చరణం:

అటుదేవతలకెల్ల నమృతమిచ్చిననీవు
యిటు వెన్న దొంగిలుట కేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు
నట రోలగట్టవడ్డచందాన కేమందును ||

చరణం:

కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు
యిల నావుల గాచుట కేమందును
తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు
చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును ||

చరణం:

భావించ నన్నిటికికంటే బరమమూర్తివి నీవు
యీవల బాలుడవైతి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీవేంకటాద్రినిలిచితి వేమందును ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం