సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇన్నిలాగులచేత లివియపో
పల్లవి:

ఇన్నిలాగులచేత లివియపో కడు
నెన్నికకెక్కిన చేతులివియపో ||

చరణం:

గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై
నెనయజాచిన చేతులివియపో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన
యినుమువంటి చేతులివియపో ||

చరణం:

పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన
యిసుమంతలు చేతులివియపో
పసుల గాచుచు గొల్లపడచుల యమునలో
యిసుకచల్లిన చేతులివియపో ||

చరణం:

పరమచైతన్యమై ప్రాణులకెల్లను
యెరవులిచ్చిన చేతులివియపో
తిరువేంకటగిరి దేవుడై ముక్తికి
నిరవుచూపెడు చేతులివియపో ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం