సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇప్పుడిటు విభుబాసి
టైటిల్: ఇప్పుడిటు విభుబాసి
పల్లవి:
ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు
తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||
నగవు లోపలి యలపు నంపైన పొలయలుక
పగటు లోపలి వెరగు పచ్చివేడి
మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు
పగలు చీకట్లాయె బాపురా చెలికి ||
బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు
చెలిమి లోపలి చేదు చింత చెలికి
బలుపు కుచములలోని బట్టబయలగు నడుము
కలిమి లోపలి లేమి కట కటా చెలికి ||
నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ
వడి మంచి తరువు వడువని తమకము
కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము
మడుగు లోపలి మైల మాన దీచెలికి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం