సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇతడొకడే సర్వేశ్వరుడు
పల్లవి:

ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||

చరణం:

పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||

చరణం:

కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||

చరణం:

తగిలిన మునులకు తపము సత్ఫలము
ముగురు వేల్పులకు మూలమీతడే
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం