సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇతనికంటే నుపాయ మిక లేదు
టైటిల్: ఇతనికంటే నుపాయ మిక లేదు
పల్లవి:
ఇతనికంటే నుపాయ మిక లేదు
మతిలోననున్న వాడు మర్మ మిదే సుండీ.
ఇన్నిలోకసుఖములు ఇంద్రియప్రీతులే
తన్ను గనినతల్లిదండ్రి తనుపోషకులే
కన్ను లెదిటిధనాలు కారణార్థములే
వున్నతి నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
కలదేవత లిందరు కర్మఫలదాతలే
లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజలకొరకే
పలుమంత్రములెల్లను బ్రహ్మలోక మీసందివె
వొలిసి ఇష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
అనుదినరాజసేవ లల్ప్రార్థహేతులే
కొనగల్పవృxఅమైన గోరినవిచ్చేటిదే
ఘన శ్రీవేంకటేశుడు కల్పించె జీవుని గావ_
వొనర నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం