సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇతరమెరుగ గతి
పల్లవి:

ఇతరమెరుగ గతి ఇదియే శరణ్యము
సతత పూర్ణునికి శరణ్యము ||

చరణం:

సకలలోకముల సాక్షియై గాచిన
సర్వేశ్వరునకు శరణ్యము
ఉర్వికి మింటికి ఒక్కట మెరిగిన
సార్వభౌమునకు శరణ్యము ||

చరణం:

శ్రీకాంత నురము చెంగట నిలిపిన
సాకారునకును శరణ్యము
పైకొని వెలిగేటి పరంజ్యోతి యౌ
సౌకుమారునకు శరణ్యము ||

చరణం:

తగ నిహ పరములు దాసుల కొసగెడి
జగదీశ్వరునకు శరణ్యము
నగు శ్రీ వేంకట నాథుడ నీకు
సుగుణమూర్తి యిదె శరణ్యము ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం