సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇతరు లేమెరుగుదు
పల్లవి:

ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు
పతులకు సతులకు భావజుడే సాక్షి ||

చరణం:

తలపు గలిగితేను దవ్వులేమి చేరువేమి
అలరు సమ్మతించితె నడ్డాకలేమి
కొలది మీరినప్పుడు కొంచెమేమి దొడ్డయేమి
సెలవిచ్చి యేకతాన జేసినది చేత ||

చరణం:

యిచ్చకమె కలిగితే యెక్కువేమి తక్కువేమి
హెచ్చిన మోహములకు నెగ్గు సిగ్గేది
పచ్చియైన పనులకు పాడియాల పంతమేల
చెచ్చెర దమకు దాము చెప్పినది మాట ||

చరణం:

అన్నిటా నొక్కటియైతే నైన దేమి కానిదేమి
యెన్నికల కెక్కితేను యీడు జోడేది
వున్నతి శ్రీ వేంకటేశు డొనగూడె నేర్పులివి
కన్నెలు దా గూడిన గతులే సంగతులు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం