సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జగడపు జనవుల
టైటిల్: జగడపు జనవుల
పల్లవి:
జగడపు చనువుల జాజర, సగినల మంచపు జాజర
చరణం:మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు, సారెకు చల్లేరు జాజర
బింకపు కూటమి పెనగేటి చెమటల, పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు, సంకుమ దంబుల జాజర
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం