సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జగతి వైశాఖ
టైటిల్: జగతి వైశాఖ
పల్లవి:
ప|| జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార- | మగణితముగ కూడె నదె స్వాతియోగము ||
చరణం:చ|| పక్కన నుక్కు కంభము పగిలించుక వెడలి | తొక్కి హిరణ్యకశిపు తొడికిపట్టి |
చక్కగా గడపమీద సంధ్యాకాలమున | వక్కలుసేసె నురవడి శ్రీనరసింహుడు |
చ|| పిప్పిగాగ చప్పరించి పేగులు జందేలు వేసి | తొప్పదోగుచు నెత్తురు దోసిట జల్లె |
రొప్పుచు కోపముతో తేరుచు పకపక నవ్వి | తప్పకచూచె వాని నుదగ్ర నరసింహుడు ||
చ|| ఎదుట ప్రహ్లాదుజూచి ఇందిర తొడపైనుంచె | అదన అందరికిని అభయమిచ్చె |
కదిసి శ్రీవేంకటాద్రి గద్దెమీద కూచుండె | వెదచల్లె కృపయెల్ల వీరనరసింహుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం