సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: జీవు డెంతటివాడు
పల్లవి:

జీవు డెంతటివాడు చిత్త మెంతటిది తన- |
దైవికము గడప నెంతటివాడు దాను ||

చరణం:

విడిచిపోవనియాస విజ్ఞానవాసనల |
గడచి మున్నాడె నెక్కడివివేకములు |
వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్థముల |
మెడవట్టి నూకె నేమిటికింక నెరుక ||

చరణం:

పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో |
రాయడికి దొడగై సైరణలేల కలుగు |
మాయనియ్యనికోపమహిమ కరుణామతిని |
వాయెత్తనియ్య దెవ్వరికి జెప్పుదము ||

చరణం:

సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని- |
నెరగనియ్యదు దనకు నేటిపరిణతులు |
తిరువేంకటాచలాధిపునిమన్ననగాని |
వెరసి యిన్నిటి గెలువ వెరవు మఱిలేదు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం