సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జలజనాభ హరి
టైటిల్: జలజనాభ హరి
పల్లవి:
ప|| జలజనాభ హరి జయ జయ | యిల మానేరము లెంచకువయ్యా ||
చరణం:చ|| బహుముఖముల నీప్రపంచము | సహజగుణంబుల చంచలము |
మహిమల నీ విది మరి దిగవిడువవు | విహరణ జీవులు విడువగ గలరా ||
చ|| పలునటనలయీప్రకృతి యిది | తెలియగ గడునింద్రియవశము |
కలిసి నీ వందే కాపురము | మలినపు జీవులు మానగగలరా ||
చ|| యిరవుగ శ్రీవేంకటేశుడ నీమాయ | మరలుచ నీవే సమర్థుడవు |
శరణనుటకే నే శక్తుడను | పరు లెవ్వరైనా బాపగలరా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం