సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జనులు నమరులు
టైటిల్: జనులు నమరులు
పల్లవి:
ప|| జనులు నమరులు జయలిడగా | ఘనుడదె వుయ్యాలగంభముకాడ ||
చరణం:చ|| వదలక వలసినవారికి వరములు | యెదురెదురై తానిచ్చుచును |
నిదురలేక పెనునిధినిధానమై | కదల డదే గరుడగంభముకాడ ||
చ|| కోరినవారికి కోరినవరములు | వోరంతప్రొద్దు నొసగుచును |
చేరువయై కృపసేసీ నిదివో | కూరిముల నడిమిగోపురమాడ ||
చ|| వడి వేంకటపతి వరములరాయడు | నుడుగు గాళ్ళు గన్నులు సుతుల |
బడిబడి నొసగును బ్రాణచారులకు | కడిమి నీడదిరుగనిచింతాడ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం