సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జయమంగళము నీకు
పల్లవి:

జయమంగళము నీకు సర్వేశ్వర
జయమంగళము నీకుజలజవాసినికి ||

చరణం:

శరణాగతపారిజాతమా
పొరి నసురలపాలిభూతమా
అరుదయిన సృష్టికి నాదిమూలమా వో
హరి నమో పరమపుటాలవాలమా ||

చరణం:

సకలదెవతాచక్రవర్తి
వెకలిపై నిండినవిశ్వమూర్తి
అకలంకమైనదయానిధి
వికచముఖ నమో విధికివిధి ||

చరణం:

కొలిచినవారలకొంగుపైడి
ములిగినవారికి మొనవాడి
కలిగినశ్రీవెంకటరాయా
మలసి దాసులమైనమాకు విధేయా ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం