సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జయము జయము ఇక
టైటిల్: జయము జయము ఇక
పల్లవి:
ప|| జయము జయము ఇక జనులాల | భయములు వాసెను బ్రదికితి మిపుడు ||
చరణం:చ|| ఘన నరసింహుడు కంభమున వెడలె | దనుజులు సమసిరి ధరవెలసె |
పొనిసె నధర్మము భూభారమడగె | మునుల తపము లిమ్ముల నీడేరె ||
చ|| గరిమతో విష్ణుడు గద్దెపై నిలిచె | హిరణ్య కశిపుని నేపడచె |
అరసి ప్రహ్లాదుని అన్నిటా మన్నించె | హరుడును బ్రహ్మయు అదె కొలిచేరు ||
చ|| అహోబలేశుడు సిరి నంకమున ధరించె | బహుగతి శుభములు పాటిల్లె |
ఇహపరము లొసగె నిందును నందును | విహరించెను శ్రీవేంకటగిరిని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం