సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కాకమరి యింతేల
టైటిల్: కాకమరి యింతేల
పల్లవి:
ప|| కాకమరి యింతేల కలుగు దమకేతమకు | చేకొన్న కోరికలు చేరునందాకా ||
చరణం:చ|| దొరతనములన్నియును దొరసినందాక | నెరతనములన్నియును నెరపినందాకా |
గరిగరికలన్నియును కలసినందాకా | విరసంబులన్నియును విసుగునందాకా ||
చ|| యెడమాటలన్నియును యెనసినందాకా | అడియాసకోరికలు అదుకునందాకా |
జడిగొన్నగుక్కిళ్ళు చవిగొన్నయందాకా | వొడలోముటలు మోహముడుగు నందాకా
చ|| యీవెల్ల దమయాత్మ యిచ్చగించినదాక | శ్రీవేంకటేశుకృప చేరునందాక |
లోవెలతులన్నియును లోగొన్నయందాక | వేవేగ బంధములు వీడునందాకా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం