సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కాలాంతకుడను వేటకాడెప్పుడు
టైటిల్: కాలాంతకుడను వేటకాడెప్పుడు
పల్లవి:
ప|| కాలాంతకుడను వేటకాడెప్పుడు దిరిగాడును | కాలంబనియెడి తీవ్రపుగాలివెర వెరిగి ||
చరణం:చ|| పరమపదంబనుచేనికి పసిగొనురనమృగములకును | తరమిడి, సంసారపుటోదములనె యాగించి |
వురవడి జేసినకర్మపుటురులు దరిద్రంబనువల | వొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ ||
చ|| కదుముకవచ్చేటి బలురోగపుగుక్కల నుసికొలిపి, | వదలక ముదిసినముదిమే వాకట్టుగ గట్టి, |
పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడగ, | పదిలముగా గింకరులనుచొప్పరుల బరవిడిచీ ||
చ|| ఆవోదంబుల జిక్కక, ఆవురులను దెగనురికి, | ఆవేటకాండ్ల నదలించాచేనే చొచ్చి, |
పాపమతి బొరెవొడిచి పరమానందము బొందుచు | శ్రీవేంకటపతి మనమున జింతించీ నరమృగము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం