సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కాలము కాలముగాను
టైటిల్: కాలము కాలముగాను
పల్లవి:
ప|| కాలము కాలముగాను కపటాలే తఱచాయ | చాలునింక దీనితోడీజాలి మానరే ||
చరణం:చ|| పిన్ననాటనుండి తనపెంచినయీదేహము | మున్నిటివలెగాదు ముదిసీని |
యెన్నికదినాలచేత నెప్పుడేడ బడునో | కన్నవారిచేతికి గక్కున నియ్యరే ||
చ|| తోలునెముకలచేత దొడ్డైనయాదేహము | గాలిచేత దాలిమీద గాగీని |
కీలుగీలు యెప్పుడేడ కింద వీడిపడునో | మేలుగీడు లేనిచొట మేటిజేసిపెట్టరే ||
చ|| కింకపుకినరుచేత కీడైనదేహము | వంకవంకతెరవుల వడిసీని |
యింక నీవిధిచేత నెప్పుడేడ బడునో | వేంకటేశు జేర బడవేయగదరే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం