సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కామధేను విదే
టైటిల్: కామధేను విదే
పల్లవి:
ప|| కామధేను విదే కల్పవృక్ష మిదే | ప్రామాణ్యముగలప్రపన్నులకు ||
చరణం:చ|| హరినామజపమె ఆభరణంబులు | పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరుపాదసేవే భోగము | పరమంబెరిగిన ప్రపన్నులకు ||
చ|| దేవునిధ్యానము దివ్యాన్నంబులు | శ్రీవిభుభక్తే జీవనము |
ఆవిష్ణుకైంకర్యమే సంసారము | పావనులగుయీప్రపన్నులకు ||
చ|| యేపున శ్రీవేంకటేశుడే సర్వము | దాపై యితనివందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు | పై పయి గెలిచినప్రపన్నులకు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం