సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కామధేనువై కలిగె
టైటిల్: కామధేనువై కలిగె
పల్లవి:
ప|| కామధేనువై కలిగె నీధరణి | వాములు వలసినవారికి విధులు ||
చరణం:చ|| అందరు జీవులే ఆయాకర్మము | బొంది బుద్ధు లెప్పుడు వేరు |
కొందరు స్వర్గము గోరి సుఖింతురు | కొందరు నరకాన గూలుదురు ||
చ|| దేవు డిందరికి దిక్కై యుండును | భావాభావమే బహువిధము |
దేవత లమృతాధీనమై మనిరి | తోవనె దనుజులు దురిత మందిరి ||
చ|| పుట్టుగందరికి పొంచి కలిగినదె | దట్టపుమనసులే తమకొలది |
యిట్టే శ్రీవేంక్టేశుడు సేసిన- | యట్టౌ నాతడు అదివో యెదుట ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం