సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కామయాగము చేసెగలికి
టైటిల్: కామయాగము చేసెగలికి
పల్లవి:
ప|| కామయాగము చేసెగలికి తన | ప్రేమమే దేవతా ప్రీతిగాను ||
చరణం:చ|| పొలుపలర సురత తాంబూల రసపానంబు | నళినాక్షి సోమపానంబు గాను |
కలకలంబుల మంచి గళరవంబులమోత | తలకొన్న వేద మంత్రములుగాను ||
చ|| పడతి తనవిరహ తాపమున బుట్టినయగ్ని | అడరి దరికొన్న హోమాగ్నిగాను |
ఒడబడిక సమరతుల నుదయించిన చెమట | దడియుటే యవబృథంబుగాను ||
చ|| తనరగుచముల రుచులు దంతాక్షతక్రీడ | నునుపైన పశుబంధనంబుగాను |
యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు | ఘనమైన దివ్య భోగంబుగాను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం