సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కాయము జీవుడుగలనాడే
టైటిల్: కాయము జీవుడుగలనాడే
పల్లవి:
ప|| కాయము జీవుడుగలనాడే తెలియవలె | యీయత్నములు దనకెన్నడు ||
చరణం:చ|| సతతము సంసారజడుడు దానట యాత్మ- | హితవు దెలుసుకాల మెన్నడు |
రతిరసముల వూరకే ప్రాయ మెడలంగ | యితరసుఖము దనకెన్నడు ||
చ|| యెడవక ద్రవ్యమోహితుడై తిరుగ దన- | యిడుమపాటు మాను టెన్నడు |
కడలేనిపొలయలుకలుచేత దనదేహ- | మిడియగ నిజసుఖ మెన్నడు ||
చ|| శ్రీవేంకటేశుని జేరి తక్కినసుఖ- | మేవగించుకాల మెన్నడు |
శ్రీవల్లభునికృప సిరిగా దలచి జీవు- | డీవైభవము గాంచు టెన్నడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం