సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కడలుడిసి నీరాడగా
టైటిల్: కడలుడిసి నీరాడగా
పల్లవి:
ప|| కడలుడిసి నీరాడగా దలచువారలకు | కడలేని మనసునకు గడమ యెక్కడిది ||
చరణం:చ|| దాహమణగిన వెనక తత్త్వమెరి గెదనన్న | దాహమేలణగు తా తత్త్వమేమెరుగు |
దేహంబుగల యన్ని దినములకు పదార్థ | మోహమేలుడుగుదా ముదమేల కలుగు ||
చ|| ముందరెరిగిన వెనుకమొదలు మరచెదనన్న | ముందరేమెరుగుదా మొదలేల మరచు ||
అందముగ దిరువేంకటాద్రీశు మన్ననల | కందు వెరిగిన మేలు కలనైన లేదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం