సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కడునడుమ చొరనేల
టైటిల్: కడునడుమ చొరనేల
పల్లవి:
ప|| కడు అడుసు చొరనేల కాళ్ళు గడుగనేల | కడలేని జన్మసాగర మీదనేల ||
చరణం:చ|| దురితంబులనెల్లదొడవు మమకారంబు- | లరిదిమమతలకు దొడ వడియాసలు |
గురుతయిన యాసలకు గోరికలు జీవనము | పరగ నిన్నిటికి లంపటమె కారణము ||
చ|| తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ- | ముదుటయినతాపమున కుండగ జోటు |
పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ- | మదము పెంపునకు దనమనసు కారణము ||
చ|| వెలయు దనమనసునకు వేంకటేశుడు గర్త | బలిసి యాతనిదలచుపనికి దాగర్త |
తలకొన్న తలపులివి దైవమానుషముగా | దలచి యాత్మేశ్వరుని దలపంగ వలదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం