సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కడుపెంత తాగుడుచు
టైటిల్: కడుపెంత తాగుడుచు
పల్లవి:
ప|| కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై | పడని పాట్లనెల్ల పడి పొరల నేలా ||
చరణం:చ|| పరులమనసునకు నాపదలు గలుగగ జేయ | పరితాపకరమైన బ్రతుకేలా |
సొరిదినితరుల మేలు చూచి సైపగలేక | తిరుగుచుండేటి కష్టదేహమిది యేలా ||
చ|| యెదిరికెప్పుడు జేము హితమెల్ల దనదనుచు | చదివిచెప్పని యట్టి చదువులెలా |
పొదిగొన్న యాసలో బుంగుడై సతతంబు | సదమదంబై పడయు చవులు దనకేలా ||
చ|| శ్రీ వేంక్లటేశ్వరుని సేవానిరతి గాక | జీవన భ్రాంతి బడు సిరులెలా |
దేవోత్తముని నాత్మదెలియ నొల్లక పెక్కు | త్రోవలేగిన దేహి దొరతనంబేలా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం