సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కదిసి యాతడు
టైటిల్: కదిసి యాతడు
పల్లవి:
ప|| కదిసి యాతడు మమ్ముగాచుగాక | అదె యాతనికె శరణంటే నంటినేను ||
చరణం:చ|| ఎవ్వని వుదరమున నిన్నిలోకములుండు | ఎవ్వని పాదము మోచె నిల యలను |
ఎవ్వడు రక్షకుడాయనీ జంతుకోట్లకు | అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు ||
చ|| సభలో ద్రౌపదిగాచె సర్వేశు డెవ్వడు | అభయ హస్తమొసగె నాతడెవ్వడు |
ఇభ వరదు డెవ్వడు యీతనికి వొడిగట్టి | అభినవముగ శరణంటే నంటి నిప్పుడు ||
చ|| శరణు చొచ్చిన విభీషణు గాచె నెవ్వడు | అరిది యజుని తండ్రి యాతడెవ్వడు |
ఇరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతడితడే | అరిసి యితనికే శరణంటే నంటి నిప్పుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం