సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: కేశవ దాసినైతి
పల్లవి:

కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరా లికనేలా వెదక

చరణం:

నిచ్చలు కోరికలియ్య నీ నామమే చాలు
తెచ్చి పునీతు(జేయ నీ తీర్థమే చాలు
పచ్చి పాపాలణచ నీ ప్రసాదమే చాలు
యెచ్చుకొందు వుపాయాలు ఇకనేల వెదక

చరణం:

ఘనుని( జేయగని నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిసి(పి?) కావగ తిరుమణి లాంఛనమే చాలు
యెనసెను దిక్కుదెస ఇకనేల వెదక

చరణం:

నెలవైన సుఖమియ్య నీధ్యానమే చాలు
నిలదాపు దండకు నీయర్చనే చాలు
యిలపై శ్రీవేంకటేశ యిన్నిటా మాకు గలవు
యెలమి నితరములు యికనేల వెదక

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం