సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కింకదీర
టైటిల్: కింకదీర
పల్లవి:
ప|| కింకదీర ’నదైవం కేశవాత్పర’మని | ఉంకువైననాలో నీవుపమలివే ||
చరణం:చ|| కంటి నీవొక్కడివే లోకములకు దైవమని | వొంటి మరి నిన్నుబోల నొకరిగాన |
వింటినీవే ఘనమని వేదాంతమందు నీ- | కంటె నితరము విన గరుణానిధీ ||
చ|| తోచె నాకు నీసేవే తుదిపదమని, మరి | తోచదీబుద్ధికి, సరితూగ దెందును |
పూచి నాగురుడు నిన్నే బోధించేగాని మరి | దాచడాయ నీమహిమ ధరణీధరా ||
చ|| సమ్మతించె నామతి జవియైనీకథలె | సమ్మతించ దెక్కడోరచ్చలసుద్దులు |
నమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలే | నమ్మితి నేమియు నమ్మ నారాయణా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం